Header Banner

ఖతార్ లో ''9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" కార్యక్రమం! అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు..

  Tue Apr 29, 2025 17:05        Qatar

ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం విజయవంతంగా ఆవిష్కరించబడింది. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' మరియు 'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీల తో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.

 

సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: భారత్‌తో పెట్టుకుంటే బాక్స్ బద్దలే.. ఈ దెబ్బతో పాకిస్తాన్‌కి అన్నీ దార్లు మూసుకుపోయినట్లే!

 

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.

 WhatsApp Image 2025-04-29 at 1.11.10 PM.jpeg

అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

 

ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు యొక్క ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించబడడం, సమగ్రస్థాయిలో రూపొందింపబడటం చాలా ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.

 

డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందనిసదస్సు యొక్క ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా మరియు ఈ సభా విశేష సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.

 

ఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు.  ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది

పూర్తి కార్యక్రమాన్ని వీక్షించుటకు

https://youtube.com/live/Y53H-PiQFeo

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli